: 300 పౌండ్ల ఇనుప తీగలతో కట్టి...లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో పడేశారట!


ఆల్ ఖైదా చీఫ్, వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ మృతదేహం ఏమయ్యిందనే విషయంపై ఇప్పటిదాకా ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు, ఒక్క అమెరికా సైనికులకు తప్ప! ఎందుకంటే, అతడిని మట్టుబెట్టడంతో పాటు అతడి మృతదేహాన్ని మాయం చేసింది వారే కదా. నాడు అమెరికా దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ గా ఉండి ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఉన్న లియోన్ పానెట్టా ‘వర్తీ ఫైట్స్: ఏ మెమాయిర్ ఆఫ్ లీడర్ షిప్ ఇన్ వార్ అండ్ పీస్’ పేరిట రాసిన పుస్తకం మంగళవారం మార్కెట్ లోకి విడుదలైంది. లాడెన్ మృతదేహాన్ని ఎలా మాయం చేసిందీ ఇందులో ఆయన విపులీకరించారు. లాడెన్ ను మట్టుబెట్టిన అమెరికా సైనికులు, అతడి మృతదేహానికి ఇస్లామిక్ ఆచారాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఓ నల్లటి బ్యాగులో సర్దేశారట. అంతకుముందే బ్యాగులో 300 పౌండ్ల ఇనుప తీగలను ఉంచారట. ఎందుకంటే, లాడెన్ మృతదేహం నీటిలో తేలకుండా ఉండేందుకేనట. ఇనుప తీగలు, లాడెన్ మృతదేహం ఉన్న బ్యాగును విమానంలోకి ఎక్కించుకుని నడి సముద్రంలో పడేశారట!

  • Loading...

More Telugu News