: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
హైదరాబాద్ శేరిలింగంపల్లి టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంపై మీడియాతో మాట్లాడిన ఆయన... తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రపంచ మేయర్ల సదస్సుకు తనను కనీసం ఆహ్వానించలేదని... ప్రొటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం అందాలని అన్నారు. కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం తనను ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచిందని మండిపడ్డారు. వాస్తవానికి తాను, తమ పార్టీ కార్పొరేటర్లు అందరూ కలసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించామని... ఇంతలోనే మమ్మల్నందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.