: విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ కు ఏడీబీ సహకారం
విశాఖ-చెన్నై మధ్య ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఏడీబీ (ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్) అంగీకరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో, 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏడీబీ ప్రతినిధులు ఒప్పుకున్నారు. ఆరు నెలల్లో ఈ పెట్టుబడులు రప్పించేలా చర్యలు తీసుకోవాలని బాబు వారిని కోరారు. ఈ కారిడార్ లో భాగంగా విశాఖ, కాకినాడ, శ్రీకాళహస్తి, మచిలీపట్నంలను పారిశ్రామిక హబ్ లుగా తీర్చదిద్దనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో శనగ రైతుల సమస్యలపై కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.