: మహారాష్ట్ర బస్సు ప్రమాదంలో మృతుల వివరాలు ఇవే...!


మహారాష్ట్రలోని కవిత్ గామ్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో జగన్మోహన్ రావు (55), లక్ష్మి (45), చలమశెట్టి పాండురంగ (60), శేషమణి (45), ఎన్. లక్ష్మీకుమారి (50), రేష్మ (20), వెంకటేశ్ (45), లక్ష్మి (55) ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండటం గమనార్హం. ఈ ప్రమాదంలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి తెంబుర్ని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రయాణానికి గురయిన సమయంలో బస్సులో మొత్తం 51 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులకు కర్మాలా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

  • Loading...

More Telugu News