: దేశంలో టాప్ 6 నగరంగా చేయాలనేదే కేసీఆర్ లక్ష్యం: హైదరాబాద్ మేయర్
ప్రపంచ మేయర్ల సదస్సులో హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. మంచి విజన్ గల నేత కేసీఆర్ అంటూ కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో హైదరాబాదును ఇండియాలోని టాప్ 6 నగరాల్లో నిలబెట్టాలనేది కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. వరల్డ్ క్లాస్ నగరంగా హైదరాబాదును కేసీఆర్ తీర్చిదిద్దుతారనే విషయంలో సందేహం అవసరం లేదని తెలిపారు.