: వాట్సప్ కోసం... ఫేస్ బుక్ వెచ్చించిన మొత్తం 22 బిలియన్ డాలర్లు!
మెసేజింగ్ సర్వీసుల్లో దూసుకెళుతున్న వాట్సప్ ను చేజిక్కించుకునేందుకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఆఫర్ చేసిన రేటు నాడు ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. వాట్సప్ కోసం ఫేస్ బుక్ మొత్తం 22 బిలియన్ డాలర్ల మేర వెచ్చించింది. వాట్సప్ టేకోవర్ కోసం నాడు ఫేస్ బుక్ ఆఫర్ చేసింది 19 బిలియన్ డాలర్లే కదా, తాజాగా 22 అంటారేంటనేగా మీ అనుమానం. మీ అనుమానం నిజమే. కాని షేర్ బజార్, ఈ డీల్ విలువను అమాంతం 3 బిలియన్ డాలర్ల మేర పెంచేసింది. అదెలాగంటే, రెండు సంస్థల మధ్య డీల్ కుదిరిన సమయంలో ఉన్న ఫేస్ బుక్ షేర్ విలువ, తాజాగా భారీగా పెరిగింది. దీంతో వాట్సప్ యాజమాన్యానికి కేటాయించిన షేర్ల విలువ కూడా పెరిగిపోయింది. దీంతో ఈ డీల్ విలువ అమాంతం పెరిగింది. సోమవారంతో వాట్సప్, ఫేస్ బుక్ లో పూర్తిగా విలీనమైపోయింది. వాట్సప్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ జాన్ కౌమ్ ను ఫేస్ బుక్ తన డైరెక్టర్ల బోర్డులోకి చేర్చుకుంది.