: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది కృష్ణా జిల్లా వాసుల మృతి


మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సులో కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్టణానికి చెందిన 40 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. యాత్రలను ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ బస్సు మహారాష్ట్రకు చెందిన సోలాపూర్ వద్ద కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News