: 10 గంటలు... రూ.600 కోట్ల విలువైన విక్రయాలు: ఫ్లిప్ కార్ట్ రికార్డు!


ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు. కేవలం పదే పది గంటలు. రూ.600 కోట్ల విలువ కలిగిన వస్తువుల విక్రయాలు. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సోమవారం సాధించిన ఘనత ఇది. దీపావళి పర్వదినం నేపథ్యంలో భారీగా జరగనున్న విక్రయాలను చేజిక్కించుకునేందుకు ఆ సంస్థ ‘ద బిగ్ బిలియన్ డే’ పేరిట ప్రవేశపెట్టిన సరికొత్త పథకం ఈ ఘనతను సాధించిపెట్టింది. వారం పాటుగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రచారం సాగించిన ఫ్లిప్ కార్ట్, ఒకే ఒక్క రోజులో ఊహించిన దాని కంటే అధికంగానే ఆర్డర్లను సాధించింది. భారత్ లో ఇప్పటిదాకా ఈ తరహా విక్రయాలు మునుపెన్నడూ నమోదు కాలేదని ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ లు సోమవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News