: గోశాల కార్మికులుగా ... రాజస్థాన్ ‘మంచి ఖైదీ‘లు!


తీవ్రమైన నేరాలకు పాల్పడి, సుదీర్ఘ కాల శిక్షలకు గురైన ఖైదీలు, గోశాల కార్మికులుగా పనిచేసేందుకు మార్గం సుగమమవుతోంది. అయితే వారు మంచి ఖైదీలై ఉండాలి. నేరాలకు పాల్పడిన ఖైదీల్లో సత్ప్రవర్తన కనిపిస్తే, వారిని గోశాలల్లో కార్మికులుగా నియమించేందుకు రాజస్థాన్ జైళ్ల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే పలు గోశాల యజమానులతో ఆ శాఖ అవగాహన ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఇక ప్రభుత్వ అనుమతి రావడమే తరువాయి, సెంట్రల్ జైళ్ల నుంచి సదరు ఖైదీలు, గోశాలలకు మారనున్నారు. గోశాలల్లో పనిచేస్తూ, అక్కడే ఉండే ఖైదీలకు భోజనం, వసతితో పాటు దినసరి వేతనాన్ని కూడా సదరు గోశాలల యాజమాన్యమే అందించనుంది. ప్రస్తుతం 23 రాజస్థాన్ ఓపెన్ జైళ్లలో 1,100 మంది ఖైదీలున్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చే దిశగా తాము తీసుకున్న ఈ నిర్ణయానికి త్వరలోనే రాజస్థాన్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేయనుందని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ అదనపు డీజీ భూపేంద్ర దక్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News