: అలంపూర్ లో ఇళ్లపై అంతస్తులు కనిపించవెందుకు!
ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలు. పల్లెల్లోనూ బహుళ అంతస్తుల భవనాలు కనిపించడం నేడు సర్వసాధారణం. కానీ మీరు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ వెళితే బహుళ అంతస్తులు ఎక్కడా కనిపించవు. ఎక్కడో వేళ్లపై లెక్కించే కొన్ని తప్ప. దీని వెనుక స్థానిక ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అష్టాదశ శక్తిపీఠాలలో అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారంటే స్థానికులకు ఎంతో నమ్మకం. అమ్మవారి ఆలయ గోపురాన్ని మించి తమ ఇళ్లు ఎత్తు ఉండకూడదని వీరు గ్రౌండ్ ఫ్లోర్ తోనే సరిపెడతారు. అయితే, గతంలో కొందరు పైఅంతస్తులు వేసుకోవడానికి ప్రయత్నించారు. దాని వల్ల వారు ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోయారని స్థానికులు చెబుతుంటారు. అందుకే అలంపూర్ లో బహుళ అంతస్తులకు స్థానికులు దూరంగా ఉంటారు.