: అంగారకుడి తొలి 3డీ చిత్రాన్ని పంపిన మామ్!
అంగారకుడిపై పరిశోధనల కోసం ఆకాశానికేగిన మామ్ ఉపగ్రహం, అరుణ గ్రహానికి చెందిన తొలి 3డీ చిత్రాన్ని పంపింది. అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన 96 గంటల్లోనే మామ్, ఈ ఫీట్ ను సాధించింది. ‘3డీ కళ్లజోడుతో ఈ చిత్రాన్ని పరిశీలించండి’ అంటూ మామ్, తన ట్వీట్ లలో వెల్లడించింది. ఈ చిత్రంలో అరుణ గ్రహంపై భారీగా దుమ్ము, ధూళి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రం విడుదల కాకముందే, ఫేస్ బుక్ లో మామ్ పేజీకి 1,185 లైక్ లు వెల్లువెత్తాయి.