: 108 సేవలు నిలిచిపోవడంపై కేసీఆర్ సీరియస్
తెలంగాణలో 108 అంబులెన్స్ సేవలు నిలిచిపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 310 అంబులెన్సుల్లో ఇంధన సమస్యతో 70 అంబులెన్సులు నిలిచిపోయాయి. దీంతో అంబులెన్సులన్నీ వైద్య సేవలు అందించాల్సిందేనని, కుంటి సాకులు చెప్పొద్దంటూ ఆయన అధికారులకు స్పష్టం చేశారు. పేరుకుపోయిన బకాయిలను విడుదల చేసి 108 సర్వీసులు తిరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.