: ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్ నిర్మిస్తున్న భారత్
భారతదేశం మరో నాలుగు దేశాలతో కలిపి ప్రపంచంలోనే అతి పెద్దదైన టెలీస్కోప్ ను నిర్మిస్తోంది. భారత్, చైనా, జపాన్, అమెరికా, కెనడా దేశాల సంయుక్తంగా అమెరికాలోని హవాయి ద్వీపంపై టీఎంటీ అనే 30 మీటర్ల పొడవైన టెలిస్కోప్ ను నిర్మిస్తున్నారు. దీని ద్వారా 500 కిలో మీటర్ల దూరంలోని చిన్న నాణెం సైజు వస్తువులను సైతం దీనితో స్పష్టంగా చూడవచ్చు. దీనిని 2022 మార్చిలోపు పూర్తిచేయాలని నిర్ణయించారు. టెలిస్కోప్ నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చులో 25 శాతం భాగాన్ని జపాన్ భరిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని ఇతర దేశాలు పంచుకోనున్నాయి. దీని నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో హవాయిలోని 4,102 మీటర్ల ఎత్తులోని మౌంట్ మౌనాకీ పర్వతంపై 100 మంది ఖగోళ శాస్త్రవేత్తలతో ప్రారంభకార్యక్రమం జరగనుంది. ఈ టీఎంటీ టెలిస్కోపు జపాన్ లోని సుబారు టెలిస్కోప్ కంటే పెద్దది.