: డ్రోన్ ల వల్ల ఎన్ని ఉపయోగాలో!
డ్రోన్ (పైలెట్ రహిత విమానం) లను వినియోగించుకుంటే మంచి ఫోటోలు వస్తాయని థాయ్ లాండ్ ఫోటో గ్రాఫర్ సిథికోర్న్ వాంగ్యూడిటియమ్ పేర్కొంటున్నారు. డ్రోన్ ల సాయంతో అమెరికాలో డోర్ డెలివరీ చేస్తున్నారు. అత్యంత సమర్థవంతంగా, నిర్దేశించిన మేరకు డ్రోన్ లు పని చేస్తున్నాయిని నిర్థారణ జరిగింది. దీంతో డ్రోన్ లు కేవలం బాంబులేయడానికే కాకుండా, ఫోటోలు తీయడానికి కూడా ఉపయోగించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ముఖ్యంగా అల్లర్లు, ప్రకృతి విపత్తులు, స్మగ్లింగ్, మతఘర్షణలు వంటి సమయాల్లో ఫోటోలు తీయడం ద్వారా థాయ్ లాండ్ లో జర్నలిజంను పూర్తిగా మార్చేశాయని ఆయన తెలిపారు. హై యాంగిల్ షూటింగ్ లకు పెద్ద పెద్ద కార్యక్రమాల కవరేజీలకు డ్రోన్ షూటింగ్ ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.