: మోడీ ప్రధాని అన్న విషయాన్ని మర్చిపోతున్నారు: సల్మాన్ ఖుర్షీద్


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, డీఎల్ఎఫ్ మధ్య జరిగిన వివాదాస్పద భూకేటాయింపులకు హర్యానా ప్రభుత్వం అనుమతివ్వడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఖండించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, వాద్రా, డీఎల్ఎఫ్ మధ్య జరిగిన భూకేటాయింపులను 2012 అక్టోబర్ లో రద్దు చేసిందని తెలిపారు. నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధాని అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ మద్దతుదారులకు ఆయన ప్రసంగం ఉత్తేజం కలిగిస్తుండవచ్చు, కానీ, ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని ఖుర్షీద్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News