: అల్జీమర్స్ పై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలకు నోబెల్


మెదడు పనితీరుపై పరిశోధనలు సాగించి, అల్జీమర్స్ తరహా ప్రమాదకర వ్యాధుల గుట్టు విప్పేందుకు మార్గం సుగమం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ ఏటి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. బ్రిటన్ లో స్థిరపడ్డ అమెరికా శాస్త్రవేత్త జాన్ ఓ కీఫ్, నార్వేకు చెందిన మే బ్రిట్ మోసర్, ఎడ్వర్డ్ మోసర్ లు 2014 మెడిసిన్ విభాగంలో బహుమతికి ఎంపికైనట్లు నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. మెదడు అంతర్భాగంలో ఉన్న జీపీఎస్ తరహా వ్యవస్థపై పరిశోధనలు సాగించిన ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు, అల్జీమర్స్ తరహా వ్యాధులు ఏ కారణం చేత తలెత్తుతాయి? ఏ తరహా చికిత్స ద్వారా వాటిని నయం చేయవచ్చు? అన్న అంశాలపై సమగ్ర అధ్యయనం చేశారు. అంతేగాక, ఈ తరహా వ్యాధులను నివారించేందుకు కూడా వీరి పరిశోధనలు దోహదం చేయనున్నాయి.

  • Loading...

More Telugu News