: టీఆర్ఎస్ కి ఆ దమ్ముందా?: టీడీపీ మహిళా విభాగం


తెలంగాణ నేతల విగ్రహాలు మాత్రమే ట్యాంక్ బండ్ పై ఉండాలని, తెలంగాణేతరుల విగ్రహాలు కూల్చేస్థామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జ్యోతీరావు పూలే, బాబూ జగజ్జీవనరాం విగ్రహాలను కూల్చేసే దమ్ముందా? వారు కూడా తెలంగాణేతరులే కదా? అని టీడీపీ మహిళా విభాగం నేతలు సవాలు విసిరారు. హైదరాబాదులోని టీడీపీ భవన్ లో మహిళా నేతలు మాట్లాడుతూ, తెలుగు నేల ఖ్యాతిని జగద్విదితం చేసి, తెలుగు జాతిని జాగృతం చేసిన మహనీయుల విగ్రహాలు కూల్చేస్తామని చెప్పడం సంస్కారహీనమైన పని అని అభిఫ్రాయపడ్డారు. కేసీఆర్ కు చేతనైతే మరిన్ని విగ్రహాలు ప్రతిష్ఠించి వారి సేవలు గుర్తు చేయడం సరైన చర్యే కానీ, విగ్రహాలు కూల్చేసి లబ్ది పొందుదామనుకోవడం సరికాదని హితవు పలికారు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని భీష్మ ప్రతిజ్ఞలు చేస్తూ, విగ్రహాలు కూల్చేసి అపఖ్యాతి మూటగట్టుకుంటారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News