: డిసెంబర్ 13న టాలీవుడ్ యువ హీరో ఆది పెళ్లి
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు, టాలీవుడ్ యువ హీరో ఆది ఈ ఏడాది ఏడడుగులు వేయనున్నాడు. డిసెంబర్ 13న ఆది, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరుణను పెళ్లాడనున్నాడు. ఆది-అరుణల పెళ్లి ముహూర్తాన్ని ఇరు కుటుంబాల పెధ్దలు నిర్ణయించారు. విజయదశమి రోజున నిశ్చితార్థం జరిగింది. చాలా నిరాడంబరంగా తన నిశ్చితార్థం జరిగిందని, పరిశ్రమకు చెందిన స్నేహితులను కూడా తాను ఈ వేడుకకు పిలవలేదని ఆది చెప్పాడు. హైదరాబాద్ లో పెళ్లి జరగనుందని, దీనికి మాత్రం అందరినీ ఆహ్వానిస్తానని తెలిపాడు. తనది ప్రేమ వివాహమంటూ మీడియాలో వస్తున్న కథనాలను ఆది ఖండించాడు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమని, బంధువుల ద్వారా ఈ సంబంధం వచ్చిందనీ అన్నాడు. తన కాబోయే శ్రీమతిది రాజమండ్రి అని... ఆమె తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులని ఆది తెలిపాడు.