: ఐఫోన్-6 ప్రారంభ ధర రూ. 53,500
యాపిల్ ఐఫోన్-6 ధరను అధికారికంగా ప్రకటించారు. రూ.53,500 నుంచి రూ.80,500 ల మధ్య లభ్యమయ్యే యాపిల్ ఐఫోన్-6, ఐఫోన్ -6 ప్లస్ లు ఈ నెల 17 నుంచి భారత మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ -6 మోడల్ విషయానికొస్తే... 16 జీబీ మెమరీ ఫోన్ ధర రూ. 53,500 కాగా, 64 జీబీ ఫోన్ రూ.62,500, 128 జీబీ ఫోన్ రూ.71,500లకు లభ్యం కానుంది. ఇక, ఐఫోన్-6 ప్లస్ విషయానికొస్తే... 16 జీబీ ధర రూ.62,500 కాగా, 64 జీబీ ధర 71,500లకు దొరకనుంది. ఇక ఈ సీరిస్ లో 128 జీబీ మెమరీ సామర్థ్యం కలిగిన ఫోన్ ధరను రూ. 80,500లుగా నిర్ణయిస్తూ యాపిల్, తన వ్యాపార భాగస్వాములకు సమాచారం చేరవేసింది. యాపిల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు ఇంగ్రామ్ మైక్రో, రెడింగ్టన్, రషి ఫెరిపెరల్స్, రిలయన్స్ లు ఈ ఫోన్లను విక్రయించనున్నాయి.