: పాపం! విస్కీ నుంచి రమ్ కు పడిపోయారు!
వెనిజులా చమురు ఉత్పత్తి పరంగా ప్రముఖ దేశం. దశాబ్దాల పాటు ఈ దక్షిణ అమెరికా దేశంలో ఆయిల్ బూమ్ కొనసాగింది. ఆ సమయంలో వెనిజులా వాసులు ఖరీదైన ఇంపోర్టెడ్ విస్కీకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. విదేశీ విస్కీ తాగడాన్ని స్టేటస్ సింబల్ గా భావించేవారు. ఇప్పుడక్కడ పరిస్థితులు మారాయి. ఆర్ధిక సంక్షోభం కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు ఒడిదుడుకులకు గురయ్యాయి. దీంతో, వారు ఖరీదైన విస్కీని కొనుగోలు చేయలేక స్థానికంగా తయారయ్యే చవక రమ్ ను ఆశ్రయిస్తున్నారట. కిందటేడాది అక్కడ విస్కీ అమ్మకాలు 29 శాతం పతనం కాగా... రమ్ విక్రయాలు 22.6 శాతం మేర పుంజుకున్నాయి. లండన్ కు చెందిన ఇంటర్నేషనల్ వైన్ అండ్ స్పిరిట్ రీసెర్చ్ (ఐడబ్ల్యూఎస్ఆర్) కన్సల్టెన్సీ సంస్థ ఈ వివరాలు తెలిపింది. వెనిజులాలో 2012లో 15.8 మిలియన్ లీటర్ల రమ్ ఉత్పత్తి కాగా, కిందటేడాది 21.8 మిలియన్ లీటర్ల రమ్ ఉత్పత్తి చేశారు.