: డీఎల్ఎఫ్ అనుమతుల అంశంలో హుడాపై చర్యలు తీసుకోండి: ఈసీకి మోడీ సూచన


భూబకాసురుల ముందు మోకరిల్లిన భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు. సోమవారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన హుడా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన డీఎల్ఎఫ్ భూములను క్రమబద్ధీకరించే క్రమంలో, హుడా ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి అనుమతిచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఈ మేరకు సహకరించని అధికారులను హుడా ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని కూడా ఆయన ఆరోపించారు. నిన్నటిదాకా మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలపై వాగ్బాణాలు సంధించిన మోడీ, తాజాగా హర్యానాలో ముఖ్యమంత్రి హుడాతో పాటు ఐఎన్ఎల్డీపైనా విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

  • Loading...

More Telugu News