: పొత్తును కాలరాసి, గౌరవం ఉందంటే ఎలా?: బీజేపీపై శివసేన గరంగరం


దివంగత నేత బాల్ ఠాక్రేపై గౌరవంతోనే శివసేనను పల్లెత్తు మాట కూడా అనడం లేదని వ్యాఖ్యానించిన ప్రధాని మోడీపై ఉద్ధవ్ ఠాక్రే ఎదురుదాడికి దిగారు. బాల్ ఠాక్రేపై గౌరవం ఉంటే, కేవలం సీట్ల సర్దుబాటులో తలెత్తిన విభేదాలతో పొత్తును ఎలా చిదిమేస్తారని ప్రశ్నించారు. బాల్ ఠాక్రే అస్తమయం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఆయనపై ఉన్న గౌరవంతోనే శివసేనపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోడీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన శివసేన, తన సొంత పత్రిక ‘సామ్నా’లో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్ ఠాక్రేపై అంత ప్రేమ ఉంటే, కేవలం సీట్ల సర్దుబాటులో తలెత్తిన విభేదాలతో సుదీర్ఘకాలం కొనసాగిన స్నేహాన్ని వదులుకుంటారా? అంటూ మోడీని ఆ పత్రిక సంపాదకీయంలో ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు.

  • Loading...

More Telugu News