: సైన్యం కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు హతం
భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు తీవ్రవాదులు చేసిన యత్నాలను సైన్యం తిప్పికొట్టంది. కాశ్మీర్లో తంగ్ భర్ వద్ద సరిహద్దు దాటేందుకు కొందరు ఉగ్రవాదులు యత్నించారు. ముష్కరుల యత్నాలను గమనించిన సైన్యం వారిని నిలువరించేందుకు కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. మిగిలిన తీవ్రవాదులు పారిపోయారు.