: అంతర్జాతీయ సదస్సుకు భాగ్యనగరం రెడీ
ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ మహానగరాల మేయర్ల సదస్సు (మెట్రో పొలిన్) కు భాగ్యనగరం సుందరంగా ముస్తాబైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సు కోసం రాజధాని రహదారులు, సదస్సు జరుగనున్న హైటెక్స్ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ దేశాల నుంచి తరలివస్తున్న అతిథులకు ఘన స్వాగతం పలికేందుకు గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, ఏర్పాట్లు, సదస్సు నిర్వహణపై ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మాదాపూర్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అతిథులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.