: బాక్సాఫీస్ ను 'బ్యాంగ్ బ్యాంగ్' చేసిన హృతిక్


హృతిక్ రోషన్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను 'బ్యాంగ్ బ్యాంగ్' చేశాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కత్రినా కైఫ్ జోడీగా హృతిక్ చేసిన విన్యాసాలు 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోయేందుకు దోహదం చేశాయి. బాక్సాఫీస్ వద్ద విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 71.72 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక్క మనదేశంలొనే ఈ మొత్తాన్ని రాబట్టడం విశేషం. 140 కోట్ల రూపాయలతో తెరకెక్కిన 'బ్యాంగ్ బ్యాంగ్' వంద కోట్ల క్లబ్ లో చేరడం సాధరణ విషయమని, అయితే 300 కోట్ల క్లబ్ లో చేరుతుందా? లేదా? అనేది చూడాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. పండుగ నేపథ్యంలో హృతిక్ సినిమా వంద కోట్లు సాధించడం మామూలేనని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News