: విద్యుత్ సమస్యకు అద్భుత పరిష్కారం
విద్యుత్ సమస్యకు అద్భుత పరిష్కారాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గాలి, వెలుతురును వినియోగించుకుని తనంతట తానే రీఛార్జ్ అయ్యే సోలార్ బ్యాటరీని అమెరికాలోని ఒహయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బ్యాటరీ, ఒక సోలార్ సెల్ ని హైబ్రీడ్ డివైజ్ కి అనుసంథానం చేసి దీనిని రూపొందించారు. సోలార్ ప్యానెల్ కు జల్లెడను ఏర్పాటు చేయడం ద్వారా ఈ నూతన ఉత్పత్తికి మార్గం సుగమమైంది. ఈ జల్లెడ ద్వారా బ్యాటరీలోకి గాలి ప్రవేశించి, ఒక ప్రత్యేకమైన చర్య జరిగి, సోలార్ ప్యానెల్, బ్యాటరీ ఎలక్ట్రోడ్ మధ్య ఎలక్ట్రాన్స్ బదిలీ అవుతాయని పరిశోధకులు తెలిపారు. దీంతో బ్యాటరీ లోపలి భాగాల్లో రసాయన చర్య జరిగి బ్యాటరీ ఛార్జ్ అవుతుందని వారు వెల్లడించారు.