: జాతీయ టీటీ క్రీడాకారులపై సీబీఐ నిఘా
జాతీయ, రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారులపై సీబీఐ నిఘా పెట్టింది. తప్పుడు జనన ధృవీకరణ పత్రాలతో వీరు పోటీలకు అర్హత సాధిస్తున్నారని, దీంతో అసలైన అర్హులకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు అందింది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఆడేవారి వల్ల తన కుమార్తెకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కకుండా పోయిందని ఓ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆడుతున్న టీటీ ఆటగాళ్ల జనన ధృవీకరణ పత్రాలపై ఆరాతీస్తోంది.