: భౌగోళికంగానే విడిపోయాం... మానసికంగా ఎప్పటికీ విడిపోం: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు భౌగోళికంగానే విడిపోయారని, మానసికంగా ఎప్పటికీ విడిపోరని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం నాటి అలయ్ బలయ్ కు హాజరైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. పార్టీలకతీతంగా బండారు దత్తాత్రేయ ఈ తరహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు స్వాగతించారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రసంగం ముగించే ముందు చంద్రబాబు, 'జై తెలంగాణ... జై ఆంధ్రప్రదేశ్' అనడం సభికులను ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News