: మోడీపై ఫేస్ బుక్ లో అసభ్యకర వ్యాఖ్యలు... ఉపాధి హామీ ఏపీఓ అరెస్ట్
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఫేస్ బుక్ లో శనివారం అనుచిత వ్యాఖ్యలు దర్శనమిచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఉపాధి హామీ పథకంలో అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న రాజేశ్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో ఉపాధి హామీ పథకం ఏపీఓగా రాజేశ్ కుమార్ పనిచేస్తున్నారు. ‘‘రాజేశ్ కుమార్ పై బలరాంపూర్ నగర పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐటీ చట్టం కింద నమోదైన ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది’’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.