: 'ఐసిస్' నుంచి తిరిగివచ్చే భారత యువకులపై కేసులు నమోదు కావు!


అవును, ఈ దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాయన్న భావన ఉంది. అయితే అందుకు భిన్నంగా మోడీ సర్కారు వ్యవహరిస్తోంది. ఉగ్రవాదుల మాయమాటలు నమ్మి, విధ్వంసక కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్న ముస్లిం యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాక్, సిరియాల్లో బరితెగిస్తున్న 'ఐసిస్' తీవ్రవాద ముఠాలో 15-20 మంది దాకా భారత ముస్లిం యువకులున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరంతా ఐసిస్ ను వదిలి స్వదేశం వస్తే, వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా ఉండే దిశగా కేంద్ర హోం శాఖ కసరత్తు చేస్తోంది. అంతేకాక, వారి తల్లిదండ్రులను విచారించే పనికి కూడా స్వస్తి చెప్పాలని ఆ శాఖ భావిస్తోంది. అయితే ఈ తరహా వ్యవహారాలపై అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే ఎదురయ్యే పరిణామాలపై ఆ శాఖ పరిశీలన జరుపుతోంది.

  • Loading...

More Telugu News