: ఈసారి కేజ్రీవాల్ కూతురు వంతు!


మొన్న జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిళ, నిన్న అరకు ఎంపీ కొత్తపల్లి గీత, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూతురు! వీరంతా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అనుచిత వ్యాఖ్యలు, ప్రచారానికి గురయ్యారు. ఫేస్ బుక్ లో కేజ్రీవాల్ కూతురును అగౌరవపరుస్తూ శనివారం పలు వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీకే జగోతియా అనే వ్యక్తి ఫేస్ బుక్ లో కేజ్రీవాల్ కూతురుతో పాటు తమ పార్టీ నేత అల్కా లాంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఘజియాబాద్ జిల్లా శాఖ నేత చేతన్ త్యాగి, సిహానీ గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News