: వియ్యంకులు కానున్న ఏపీ మంత్రులు నారాయణ, గంటా


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు వియ్యంకులుగా మారనున్నారు. గంటా శ్రీనివాసరావు కుమారుడికి, నారాయణ రెండో కుమార్తెతో వివాహం జరిపించేందుకు ఇరువురు మంత్రులు అంగీకరించారు. దీంతో ఇప్పటిదాకా సహచర మంత్రులుగా ఉన్న శ్రీనివాసరావు, నారాయణలు ఇకపై వియ్యంకులుగా మారనున్నారు. గంటా కొడుకు రవితేజ, నారాయణ కూతురు షరిణిల మధ్య వివాహానికి సంబంధించి శనివారం నెల్లూరులోని నారాయణ స్వగృహంలో జరిగిన సంప్రదింపులు ఫలించాయట. కొడుకు, కూతురు ఉన్న గంటా గతేడాది కూతురు పెళ్లి చేశారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్న నారాయణ పెద్ద కుమార్తెకు ఇటీవలే పెళ్లి చేశారు. తాజాగా రెండో కుమార్తెకు కూడా ఆయన వివాహం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సింగపూర్ లో బీబీఎం పూర్తి చేసిన రవితేజ, అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. ఇక షరిణి లండన్ లో ఎంబీఏ పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News