: ఛాంపియన్ చెన్నై...రైనా ఉతికేశాడు!


ఛాంపియన్స్ లీగ్ టీ20లో చెన్నై ఛాంపియన్ గా నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని చెన్నై కేవలం మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. లక్ష్యఛేదనలో సరేష్ రైనా విశ్వరూపం ప్రదర్శించాడు. బౌలర్ ఎవరన్న తేడా లేకుండా శివాలెత్తిన సురేష్ రైనా 'శత'క్కొట్టాడు. దీంతో చెన్నై పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. కేవలం 62 బంతుల్లోనే 6 సిక్స్ లు, 8 ఫోర్లతో సురేష్ రైనా 109 పరుగులు సాధించడం విశేషం.

  • Loading...

More Telugu News