: జీన్స్ ఎఫెక్ట్ ... యేసుదాసుపై కేసు!
మహిళలు జీన్స్ వేసుకోవడం భారతీయ సంప్రదాయం కాదని చెప్పిన ప్రముఖ గాయకుడు కేజే యేసుదాసుపై కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గాంధీ జయంతి రోజున ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహిళలు జీన్స్ వేసుకోవడం సరికాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఒంటికాలిపై లేచాయి. మహిళలకు వస్త్రధారణపై ఆంక్షలు విధిస్తున్నారంటూ, ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏకంగా ర్యాలీ కూడా నిర్వహించాయి. గాయకుడిగా ఆయనను గౌరవిస్తున్నామని పేర్కొన్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.