: గుంటూరులో ఘోర ప్రమాదం... ముగ్గురు వ్యక్తుల సజీవదహనం
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొల్లాపల్లి మండలం రావులాపురంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగి, బోరువెల్స్ లారీపై పడడంతో, లారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. వారిని రక్షించే అవకాశం కూడా లేకపోవడం, స్థానికుల కళ్ల ముందే కాలిపోవడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.