: హర్యానా మాజీ సీఎం బెయిల్ రద్దు చేయండి: సీబీఐ
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్రమ నియామకాల కేసులో శిక్షపడిన చౌతాలా బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చౌతాలా ఈ నెల 15న జరగనున్న హర్యానా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. బెయిల్ ఉపసంహరిస్తే ఆయన మరోసారి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.