: ఆ ఉత్సవంలో ఓ బాలుడు మృతి చెందగా... 70 తలలు పగిలాయి


మానవతావాదులు, హక్కుల సంఘాలు, పోలీసులు భయపడ్డంతా జరిగింది. సంప్రదాయం మాటున తలలు పుచ్చకాయల్లా పగిలాయి. తాగిన మైకంలో కక్షలు, కార్పణ్యాలకు ఉత్సవాన్ని ఉపయోగించుకోవడంతో కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. మాల మల్లేశ్వర స్వామి మూలవిరాట్టును దక్కించుకోవడానికి కర్రలతో చేసుకున్న ఈ యుద్ధంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా, 70 మంది భక్తుల తలలు పగిలి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎనిమిదేళ్ల మహేశ్ ఉత్సవం చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో పడి నలిగిపోయి మృతి చెందాడు. ప్రతియేటా జరిగే దేవరగట్టు జాతరలో గాయాలపాలవ్వడం, మృతి చెందడం సర్వసాధారణమే అయితే బాలుడు మృతి చెందడం అందరినీ కలచివేసింది. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి మూలవిరాట్టును దక్కించుకునేందుకు రెండు వర్గాలుగా విడిపోయిన భక్తులు కర్రలతో కలబడ్డారు. ఈ యుద్ధం మర్నాడు తెల్లవారే వరకూ జరిగింది. కర్రల యుద్ధంలో పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఓ సందర్భంలో మూలవిరాట్టు కోసం రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేసి లాఠీఛార్జ్ చేశారు. భక్తులు రాళ్లు రువ్వడంతో గతేడాది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News