: తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వేస్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చిన ఆయన మాట్లాడుతూ, తిరుపతి రైల్వే స్టేషన్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. సదానందగౌడ దంపతులు రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం, శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకునేందుకు వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News