: మధ్యప్రదేశ్ రైతును వరించిన ఐశ్వర్యం, పొలంలో దొరికిన 12.93 క్యారెట్ల వజ్రం
మధ్యప్రదేశ్ లో ఓ రైతుకు అనుకోని విధంగా అదృష్టం కలసిరావడంతో ఐశ్వర్యం వరించింది. వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలోని దెహ్లాన్ చౌక్ ప్రాంతానికి చెందిన ఆనంద్ సింగ్ అనే రైతుకు తన గని క్షేత్రంలో పనిచేస్తుండగా 12.93 క్యారెట్ల విలువైన వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వెంటనే రైతు సంబంధిత అధికారులకు తెలియచేశాడు. దీంతో, వారు వెంటనే ఆ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ వజ్రాన్ని త్వరలో వేలం వేసి వచ్చిన డబ్బును రైతుకి అందచేస్తామని అధికారులు తెలిపారు. వేలంలో రైతుకు 40 లక్షల దాకా రావచ్చని తాము అంచనా వేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఈ విషయం వేగంగా వ్యాపించడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు వేల సంఖ్యలో ఆనంద్ సింగ్ క్షేత్రానికి చేరుకున్నారు.