: నీరో చక్రవర్తి లాంటి మహిళ... వైద్య చరిత్రలో అద్భుతం!


రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడట... ఆయన ఎందుకలా కూర్చున్నాడో తెలియదు కానీ, నయోమి ఎలిషువ్ అనే మహిళ మాత్రం బ్రెయిన్ కు ఆపరేషన్ చేస్తుండగా వయోలిన్ వాయించింది. ఇజ్రాయెల్ కు చెందిన నయోమి ఎలిషువ్ వయోలిన్ వాయిద్యకారిణి, ఆమెకు వయోలిన్ వాయించడమంటే చాలా ఇష్టం. 20 ఏళ్ల క్రితం ఆమె మెదడులో ఏర్పడిన సమస్య కారణంగా వయోలిన్ వాయించేటప్పుడు చేతులు వణుకుతూ అపశ్రుతులు పలుకుతున్నాయి. దీంతో ఆమె త్రీవ ఆవేదన చెందేది. ఆమె సమస్యను సరిచేస్తామంటూ ఇజ్రాయెల్ లో కొందరు వైద్యులు ముందుకు వచ్చారు. అయితే శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు వయోలిన్ వాయించాలనే షరతు పెట్టారు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించకుండా చూసుకునే బాథ్యత తమదని వారు భరోసా ఇచ్చారు. దీంతో ఆమె ధైర్యంగా శస్త్రచికిత్సకు అంగీకరించారు. దీంతో ఆమె వయోలిన్ వాయిస్తుండగా ఆపరేషన్ ప్రారంభించిన వైద్యులు విజయవంతంగా ఆమె మెదడులో సమస్యకు కారణమైన ప్రాంతాన్ని కనుగొన్నారు. అక్కడ ఓ ఎలక్ట్రోడును అమర్చి మరోసారి వయోలిన్ వాయించాలని కోరారు. దీంతో ఆమె సమస్య పరిష్కారమైందని నిర్థారించుకుని శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఇప్పుడామె ఎలాంటి అపశ్రుతి లేకుండా వయోలిన్ వాయించగలుగుతోంది. మరి కొద్ది రోజుల్లో మరోసారి తన కెరీర్ ప్రారంభిస్తానని ఆమె ఆశగా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News