: మహారాష్ట్రను కాంగ్రెస్-ఎన్సీపీ దోచుకున్నాయి: మోడీ
కాంగ్రెస్-ఎన్సీపీపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. బీడ్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత పదిహేనేళ్లుగా మహారాష్ట్రలో అధికారం వెలగబెట్టిన ఆ రెండు పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాలని నిలదీశారు. గోపీనాథ్ ముండే ఉండి ఉంటే తాను ఇక్కడికి వచ్చే అవసరమే ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పేదల సంక్షేమానికి గోపీనాథ్ ముండే ఎంతో చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్-ఎన్సీపీ పాలన పూర్తిగా గాడితప్పిందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని తాను ఆశిస్తున్నానని అయన తెలిపారు.