: ఫోర్బ్స్ జాబితాలో చోటుంది...అయినా రోడ్లమ్మటపడ్డారు!


భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా ఫోర్బ్స్ జాబితా ఆమెకు స్థానం కల్పించింది. కార్పొరేట్ దిగ్గజంగా పేరొందిన ఆమె ఓట్ల కోసం రోడ్లమ్మటపడ్డారు. తనే రాజకీయ వేత్త నవీన్ జిందాల్ తల్లి, ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్! గత రెండు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన ఆమె ప్రస్తుతం హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. హర్యానాలోని హిసార్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి తనకే ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. 64 ఏళ్ల సావిత్రి జిందాల్ హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహలాడుతున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండే సావిత్రి జిందాల్ నియోజకవర్గమంతా కలియదిరుగుతూ, ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలకు తావులేకుండా, తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News