: విజయవాడలో రేపు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మెగాస్టార్
విజయవాడలో రేపు దివంగత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించనున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఈ కార్యక్రమంలో పరుచూరి బ్రదర్స్ కు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. విజయవాడకు చెందిన రాజకీయనాయకులతో పాటు రాంచరణ్, అల్లు అర్జున్, వి.వి వినాయక్ లాంటి సినీప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.