: కాశి ఎప్పటికీ క్యోటో కాలేదు: ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గోవిందాచార్య


స్మార్ట్ సిటీల దిశగా మోడీ సర్కారు అవలంబిస్తున్న వైఖరిపై ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గోవిందాచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలి జపాన్ పర్యటనలో భాగంగా మోడీ, తన సొంత నియోజకవర్గం వారణాసిని క్యోటోగా తీర్చిదిద్దేందుకు జపాన్ సహకారాన్ని కోరిన సంగతి తెలిసిందే. అందుకు జపాన్ ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. తాజాగా ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గోవిందాచార్య, మోడీ వైఖరిపై గళం విప్పారు. కాశి, ఎప్పటికీ క్యోటో కాలేదని వ్యాఖ్యానించారు. పవిత్ర కాశి ప్రాశస్త్యాన్ని కాలరాసి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ యోచన తప్పన్నారు. ‘‘పరమ శివుడికి ఆవాసమైన కాశిలో 12 జ్యోతిర్లింగాలున్నాయి. పెద్ద సంఖ్యలో శక్తి పీఠాలకూ కాశి నిలయం. ఇక్కడే గంగ ఉత్తరవాహినిగా కీర్తి నందుకుంటోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న కాశిని, క్యోటోతో పోల్చడం సరికాదు. అలాంటి పోలిక పిల్ల చేష్ఠే’’నని గోవిందాచార్య మండిపడ్డారు. మరి గోవిందాచర్య వ్యాఖ్యలకు, ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News