: పాదచారులను పొట్టనబెట్టుకున్న లారీ


రోడ్డు పక్కగా నడుచుకుంటూ వస్తున్న పాదచారుల పాలిట ఆ లారీ మృత్యుశకటంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళుతున్న పాదచారులపైకి ఆ లారీ దూసుకెళ్లింది. దీంతో లారీ టైర్ల కింద వారు నలిగిపోయారు. అయితే ప్రమాదం జరిగినా, లారీని నిలపని డ్రైవర్ మరింత స్పీడు పెంచాడు. ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి వెళ్లిపోతున్న లారీని నిలువరించేందుకు స్థానికులు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో స్థానికులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారమందించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించిన పోలీసులు లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News