: చైనా చౌక వస్తువులను కొనొద్దు: మోహన్ భగవత్
చౌకగా లభిస్తున్న చైనా ఉత్పత్తుల కొనుగోళ్లపై మక్కువ చూపుతున్న భారతీయులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానాటికీ పెరిగిపోతున్న చైనా ఉత్పత్తులపై మమకారాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఆరెస్సెస్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కీలక ప్రసంగం చేసిన ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘చౌకగా దొరుతున్నాయి కదా అని దేవతా విగ్రహాలను కూడా చైనాలో తయారైనవే కొనుగోలు చేస్తున్నాం. ఈ అలవాటుకు స్వస్తి చెప్పాల్సిందే’నని ఆయన వ్యాఖ్యానించారు.