: భద్రగిరికి కల్యాణ శోభ.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు


ఖమ్మం జిల్లా భద్రాచలానికి పెళ్లి కళ వచ్చేసింది. శుక్రవారం సీతారాముల కల్యాణం జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం జరిగింది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సంతాన భాగ్యాన్ని కలిగించే గరుడ ప్రసాదం కోసం ఎక్కువ మంది మహిళలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. మరోవైపు భద్రాచలంలో రామయ్య కల్యాణానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News