: రాజమౌళి బాటలో ఫరాఖాన్
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి బాటలో బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ నడిచారు. హీరోల క్రేజ్ ను సొమ్ము చేసుకోవడంలో ముందుండే బాలీవుడ్ దర్శకులు సినిమాను బాగా ప్రచారం చేస్తారు. 'బాహుబలి' సినిమా షూటింగ్ జరుగుతుండగా, సినిమా కోసం యూనిట్ పడుతున్న కష్టాన్ని రాజమౌళి వీడియోగా చిత్రీకరించి విడుదల చేశారు. శారీరక ధారుడ్యం కోసం ప్రభాస్, రాణా, అనుష్క చేసిన ఎక్సర్ సైజుల్ని వీడియోలో చూపించి అభిమానులను అలరించారు. తాజాగా ఫరాఖాన్ కొత్త సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా లో సిక్స్ ప్యాక్ కోసం షారూఖ్ ఖాన్ పడిన కష్టాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. దీనికి సామాజిక నెట్ వర్క్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఫరాఖాన్ దర్శకత్వంలో షారూఖ్ 'ఓం శాంతి ఓం', 'మై హూ నా' సినిమాల్లో నటించారు.