: ఆరు నెలలుగా జీతాలు అందడంలేదు, ఎలా బతకాలి?: కేసీఆర్ ను ప్రశ్నించిన 108 ఉద్యోగులు


గత కొంతకాలంగా జీతాలు అందకపోవడంతో తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ కు గురువారం రాత్రి ఓ లేఖ రాసింది. ఆరు నెలలుగా తమకు జీతాలు అందడం లేదని, జీతాలు లేకపోతే ఎలా బ్రతుకుతామని వారు ఈ లేఖలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నెల కూడా ఇంకా జీతాలు అందకపోవడంతో దసరా, బక్రీద్ లాంటి పండగలు చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని వారు లేఖలో ప్రస్తావించారు. తమకు వెంటనే వేతనాలు అందేలా కేసీఆర్ చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా పండగలు జరుపుకుంటుంటే, తమ కుటుంబాలు మాత్రం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News