: యువకుడి వేధింపులు తాళలేక అమ్మాయి ఆత్మాహుతి
యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మాహుతికి పాల్పడింది. మహారాష్ట్రలోని థానే భయందర్ టౌన్ షిప్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువతిని స్థానిక యువకుడు ప్రేమించాలంటూ వేధించేవాడు. ప్రేమించకపోతే చంపుతానని బెదిరింపులకు దిగేవాడు. దీంతో అతని వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పోలీసులు ఆ యువకుడిపై ఐపీసీ సెక్షన్ 306, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ అతడిని అరెస్టు చేయకపోవడం విశేషం.